ప్రభుత్వ పాఠశాలల్లో స్కావేంజర్లు,స్వీపర్లను నియమించాలి: ఎస్ఎఫ్ఐ

Published: Thursday September 02, 2021
మంచిర్యల బ్యూరో, సెప్టెంబర్ 01, ప్రజాపాలన : ప్రభుత్వ పాఠశాలల్లో స్కావేంజర్లు, స్వీపర్లను, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, పిఈటీ పోస్టుల భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి ఫణి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆ పాఠశాల లో నెలకొన్న సమస్యలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 ఈరోజు నుండి ప్రారంభమైన విద్యాసంస్థలు. ప్రారంభమైన ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలైన త్రాగునీరు,మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ కల్పించాలని అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసినటువంటి స్కావెంజర్, స్విపర్లను ప్రభుత్వం తొలగించిందని వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. పాఠశాలలో పరిశుభ్రత కు సంబంధించి తాత్కాలికంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీల కార్మికులకు బాధ్యతను అప్పగించడం సరైన పద్ధతి కాదని, పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. తాత్కాలిక కార్మికులు పూర్తికాలం సంవత్సరంపాటు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేయలేరని, గతంలో తొలగించిన వారిని వెంటనే నిరమింఛాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల ఏడవ తేదీన జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ సన్నద్ధమవుతోంది.