ఈ పేరు వింటే యువకుల రక్తం ఉపొంగిపోతుంది*** - మృత్యువును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్.

Published: Thursday September 29, 2022
 చేవెళ్ళ సెప్టెంబర్ 28: (ప్రజాపాలన)                 
చేవెళ్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 115వ  జయంతిని పురస్కరించుకొని   చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం కోసం, 23 సంవత్సరాల అతిచిన్న వయస్సులో ఉరికంబాన్ని ముద్దాడిన వ్యక్తి భగత్ సింగ్ అన్నారు.అయన దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు,భగత్ సింగ్ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి పేద ప్రజల కోసం నా భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలగాలని ఆకాంక్షించి పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించాడు. ఈ దేశంలో పేద ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా లభించాలని భగత్ సింగ్ కలలు కన్నాడు కానీ నేటి మన పాలకులు వారి త్యాగాలకు విలువలు లేకుండా పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ విద్యా వైద్యాలతో వ్యాపారం చేస్తూ పేదవారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్న
 
 
 
Attachments area