తెలంగాణ రాష్ట్రం పట్టణ ప్రగతిలో పచ్చదనం

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ ప్రగతి భాగంలో హరితహారం ప్రతి ఇంటింటికీ ఆరు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పెట్ మున్సిపల్ కార్పోరేషన్ లో 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ఆధ్వర్యంలో ఎం. సి .ఆర్ కాలనీలో 3 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి పాల్గొని కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక కాలనీ వాసులతో కలిసి శనివారం నాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..... పట్టణ ప్రగతి లో భాగంగా నగరాల, అభివృద్ధికి 2,211 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. కార్పొరేషన్ లు, మునిసిపాలిటీ లలో సమీకృత మార్కెట్లకు కొరకు రాష్ట్ర కృషి చేస్తుందని చెప్పారు. మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, పూడిక తీస్తూ పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి, పెట్టిన ప్రభుత్వాన్ని మంత్రి అన్నారు. తడి, పొడి చెత్త వేరువేరుగా వేసేలా ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రజల దరి చేరకుండా హరితహారం వల్ల వాతావరణం మార్పు చెందుతుందన్నారు. పట్టణ ప్రగతి లో భాగంగా దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ద్రావనాలను పిచికారీ చేయటం, తాగు నీటి సరఫరా ట్యాంకుల ను శుభ్రం చేస్తూ, శిథిలాలు, వ్యర్థాలు, పిచ్చి మొక్కలు  తొలగించి, పరిశుభ్రత పరిరక్షణ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయనీ చెప్పారు. గ్రామాల్లో లాగా పట్టణాల్లోనూ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన విధానం పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అవడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ ప్రగతికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందినీ ఇదే స్ఫూర్తి అందరూ నిరంతరం కోనసాగాలినీ కోరారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వైకుంఠ దామలు, బస్ స్టాండ్ లు, జన సమ్మర్థ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెల రాష్ట్రంలో ని మునిసిపాలిటీ లు, కార్పొరేషన్ లకు పట్టణ ప్రగతిలో భాగంగా 148 కోట్ల నిధులు నేరుగా విడుదల అవుతున్నాయన్నారు. గ్రీన్ బడ్జెట్ కోసం 10 శాతం కేటాయించారు, ప్రతి ఇంటి వద్ద అందించిన ఆరు మొక్కలను తప్పకుండా నాటి సంరక్షించాలినీ తెలిపారు. అంతర్గత రోడ్లు, వెంచర్ లలో ఓపెన్ స్థలాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర కార్యాలయాల వద్ద మొక్కలు నాటి హరిత తెలంగాణ రాష్ట్ర కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో, గత ఆరు దఫాలుగా నిర్వహించిన హరితహారంతో తెలంగాణ లో 33 శాతం కు పెరిగిన అడవులు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలంటే అందరూ మొక్కలు నాటాలినీ మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సందర్భంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి  ఒక్కో వ్యక్తికి 12 కిలోలు, ఖాతాలో 1500 రూపాయలు వేయటం జరిగిందనీ, రెండో వేవ్ సందర్భంగా ఒక్కో వ్యక్తికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారికి స్వచ్ఛందoగా సరుకులు పంపిణీ కి ముందుకు వచ్చిన బ్రాహ్మణ సేవ సంఘం వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, స్థానిక కార్పొరేటర్ బిమిడి  స్వప్న జంగారెడ్డి, కార్పొరేటర్లు, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ ఈ అశోక్ రెడ్డి, ఏఈ రాంప్రసాద్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, నాయకులు, అధికారులు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.