బండ రావిరాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి సిపిఎం డిమాండ్

Published: Saturday September 03, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.బండ రావిరాల ,చిన్న రావిరాల సర్వే,నెంబర్, 268లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం లేదా భూమికి భూమి ఇవ్వాలని 18 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సత్తుపల్లి చౌరస్తాలో, మానవహారం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా, భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలని, అనేక ఆందోళన పోరాటాలు చేసి, మంత్రులను ఎమ్మెల్యేలను, కలిసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ , శాసనసభలో ముఖ్యమంత్రి  కూడా రైతులకు నష్టపరిహారం ఇస్తామని నష్టపరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు, నష్టపరిహారం ఇవ్వకపోగా, కంకర మిషన్ యాజమాన్యులకు మాత్రం, వత్తాసు పలుకుతూ ఉన్న కంకర మిషన్లకి, రెన్యువల్ చేయించి, అదనంగా కొత్త కంకర మిషన్ తీయడం కోసం ఎమ్మెల్యే తో సహా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కంకర మిషన్ యజమానులు, ప్రజాభిప్రాయ సేకరణ, బయట నుండి వందలాది మందిని , డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి, ప్రజలపై సేకరణలో నిగ్గడం కోసం పెద్ద కుట్ర చేస్తున్నారు. దీనికంతటికి కూడా, తెలంగాణ ప్రభుత్వం, కారణం, అని అదేవిధంగా రైతులకు నష్టపరి అని ఇవ్వకపోతే, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బండరాయిరాల సర్పంచి కబాడీ శ్రీనివాస్ రెడ్డి . మాట్లాడుతూ, రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే మా గ్రామంలోనికి అధికారుల్ని ప్రజాప్రతిని రాకుంటే అడ్డుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, నేతీ కృష్ణ , మైసయ్య, ఐలయ్య, శివలక్ష్మి సాకలి బాలమ్మ అభవతి బసవమ్మ నిర్మలమ్మ భాగ్యమ్మ, మల్లేశా, లక్ష్మయ్య  తదితరులు  పాల్గొన్నారు.