దంపతులను ఆశీర్వదించిన జైల్ సూపర్ డెంట్ దేవ్లానాయక్..

Published: Monday August 08, 2022
తల్లాడ, ఆగస్టు 7 (ప్రజాపాలన న్యూస్): 

ఉమ్మడి  ఖమ్మంజిల్లా పరిధిలోని పాల్వంచలో ఆదివారం సురేష్, మీనాక్షి వివాహం ఎంతో వైభోవపేతంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యఅతిథిగా నల్గొండ జైలు సూపర్ డెంట్ దేవ్లానాయక్, సుగుణ దంపతులు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో హాయిగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బాదావత్ సైదులు నాయక్, రామ్మూర్తి నాయక్, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.*