కరోనా సేవలో యువత ముందుండాలి

Published: Monday May 10, 2021
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు
ఖమ్మం ,మే 9,ఆదివారం (ప్రజాపాలన ప్రతినిధి) : యువత కరోనా సేవలో ముందుండాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.స్థానిక సుందరయ్య భవనం లో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అద్యక్షతన జరిగిన డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోణా కష్ట కాలంలో సహయకార్యక్రమాలలో యువత ముందుండాలి అని ,ఈ మహమ్మారి వైరస్ కు అందరూ భయపడుతున్నారు అని కానీ అన్ని జాగ్రత్తలూ తీసుకోని యువత ధైర్యం గా సహయ కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్ గారు మాట్లాడుతూ ఈ నేలలో BVK ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోణా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సెంటర్ లో వాలంటీర్లు గా పనిచేయడానికి 60మంది డివైఎఫ్ఐ కార్యకర్తలు ముందు కు వచ్చినందుకు ఆయన  అభినందించారు. అలాగే కలక్టర్ గారి ఆదేశాలతొ కరోణా బాధిలకు ఆహారం అందించేందుకు డివైఎఫ్ఐ కార్యకర్తలు ముందుకు వచ్చినందుకు ఆయన అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సహయ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఈ దేశం లో అనేక విపత్తుల సందర్భంగా సహయ కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఇప్పుడు కూడా కరోణా కష్ట కాలంలో డివైఎఫ్ఐ కార్యకర్తలు ముందుండు పనిచేస్తున్నారు అని వారిని ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలో కూడా సహయ కార్యక్రమాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.... ఈ సమావేశంలో CPM జిల్లా నాయకులు బండి రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ తో పాటు గా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, ఇంటూరి అశోక్, గుమ్మా ముత్తారావు, దిండు మంగపతి, రావులపాటి నాగరాజు, కూరపాటి శ్రీను, జక్కంపూడి క్రిష్ణా, కణపర్తి గిరి, దాసరి మహేందర్ షేక్ షరీఫ్, షేక్ సైదులు, గోపి, పుష్పరాజ్, మంగయ్య, అశోక్, మదు తదితరులు పాల్గొన్నారు