పోచమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట* *ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Thursday August 18, 2022
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని  , ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టకు హాజరైన ఎమ్మెల్యే. ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, దాతల సహకారంతో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో రెండు పోచమ్మ అమ్మవార్ల ఆలయాలను నిర్మించి, ఒక్కొక్క ఆలయానికి పదకొండేసి లక్షలు వెచ్చించి మొత్తం 22 లక్షలతో దేవాలయల నిర్మాణాలను పూర్తి చేసి యజ్ఞం ప్రత్యేక పూజలు విగ్రహాల ప్రతిష్ట చేసినందుకుగాను రామ్ రెడ్డిని, పాలకవర్గాన్ని, సహకరించిన గ్రామ ప్రజలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు  కృషి చేస్తోందని అన్నారు.  రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకుంటున్నదని అన్నారు. దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. తొలుత 3వేల దేవాలయాలకు ధూప,దీప, నైవేధ్యాల కోసం నిధులను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా జీవో నెంబర్ 248 ద్వారా 2017, నవంబర్8 నుంచి 4,805 దేవాలయాలకు వర్తింపజేసిందన్నారు. ఈ పథకం ద్వారా దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.25 కోట్లు కేటాయిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, లారీ ఓనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, చిలుకల బుగ్గరాములు, జెర్కొని రాజు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఉప్పరగూడ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి,ఉప సర్పంచ్ బూడిద నరసింహ్మరెడ్డి, ఎం శ్రీనివాస్, పి జగన్ మోహన్ రెడ్డి, పి జితేందర్ రెడ్డి, బి పద్మ, పి లలిత, బి. శ్రీ వేణి, ఎన్ శశిరేఖ, ఎం అనిత, ఎన్ మహేందర్,పి. సురేందర్ రెడ్డి, ఎం. గోపాల్, బి మమత తదితర గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.