ఏపీజీవీబీ ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

Published: Thursday October 07, 2021
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : గ్రామీణ ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బాంక్ బంజారా కాలనీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ యామిని శాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే విధిగా ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, జీవన జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జనరల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. తద్వారా 24 లక్షల రూపాయల వరకు లబ్ది పొందే వీలుందని సూచించారు. ప్రజలకు పొదుపు, ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు వైవీ రావు మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో బాంక్, ఐకేపీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.