ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలి

Published: Wednesday November 16, 2022
పాలేరు నవంబర్ 15  ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ప్రవేట్ టీచర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రవేట్ టీచర్స్ ఫోరమ్ పాలేరు డివిజన్ అధ్యక్షుడు సాగర్ డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తకొత్తూరు ఓ ప్రవేట్ పాఠశాలలో మంగళవారం సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రవేట్ టీచర్స్ ఎదుర్కుంటున్న పలు సమస్యల ను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. తమ పట్ల నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఈ నెల 20 న ఖమ్మం లో జరిగే విద్యా సేవా పురష్కార అవార్డుల కార్యక్రమం ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం విద్యా సేవా పురష్కార్ కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్, వెంకట్, జానీ, శ్రీను, సుందర్, శ్రీకాంత్, -బాలాజీ, అంజయ్య, శ్రీదేవి, భవాని, సునీత, హైమాబాయి, సింధు, రమ్యశ్రీ.. వీరకుమారి. ప్రతిభ రేణుక, సునీత దివం. మమత తదితరులు పాల్గొన్నారు