అపోహలు వీడి కంటి పరీక్ష చేయించుకోండి

Published: Friday January 20, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజా పాలన : కంటినొప్పి సమస్యలతో బాధపడే వారందరూ శిబిరాలకు వచ్చి కంటి పరీక్ష చేయించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు కౌన్సిలర్ గాయత్రీ లక్ష్మణ్ కు సంబంధించిన శివరాంనగర్ కాలనీలో ధారూర్ మండల కేంద్రంలోని రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి
పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి వారి ఆధార్ కార్డు లింక్ తో ఎవరి కళ్లద్దాలు వారికే  బార్ కోడ్ తో అందించబడతాయన్నారు. ప్రతి క్యాంపు దగ్గర ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందించబడతాయన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అధిక సంఖ్యలో ప్రభుత్వం ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.