మొరంపల్లి బంజర్ లో ఘనంగా గొంతెనమ్మ పండుగ వేడుకలు.

Published: Monday November 28, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)
పాండవులు దైవంగా భావించి గొంతెనమ్మ పండుగను గత 15 రోజులుగా మొరంపల్లి బంజరులో గొంతానమ్మ  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా శుక్రవారం బంగారం(మట్టి),పాలు, నెయ్యి తదితర వస్తువులతో తయారుచేసిన నంది విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చివరి రోజులో భాగంగా శనివారం నందన్నను మేళతాళాలతో గ్రామ ప్రధాన వీధులలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు . ఊరేగింపు అనంతరం పవిత్రమైన గోదావరి నదిలో భక్తులందరూ పుణ్యస్నానాలు ఆచరించారు.దీంతో గొంతెనమ్మ పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి.