రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

Published: Thursday February 23, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలో బుదవారం రోజున కేదార్ గార్డెన్ లో 5, 20, 21, 22 వార్డ్ మెంబర్స్ తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు డాక్టర్  కల్వకుంట్ల సంజయ్ కుమార్  నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలన్నారు. పట్టణంలోని నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని కోరారు.ఆసరా పథకం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప పథకం మని ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినంత అభివృద్ధి ఏ పార్టీ ఇప్పటివరకు చేయలేదని మరియు బిజెపి వాళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్ లో వాటా కేంద్ర ప్రభుత్వానిది ఉందని ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. బిజేపి ప్రభుత్వం పాలించే రాష్ట్రాలలో 600, 800 పెన్షన్లు ఇస్తున్నారు అలాంటిది తెలంగాణలో మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం ఏం చేసింది లేదని అన్నారు.బిజెపి ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ మతలర పేరుతో కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతుందని అన్నారు. ప్రజలందరూ ఏకమై కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, వార్డ్ కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.