ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ఈ లింక్ రోడ్లు

Published: Tuesday June 29, 2021
- మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆర్.టి.ఏ కార్యాలయం సమీపంలో నూతనంగా రూ.15.86 కోట్లతో నిర్మించిన లింక్ రోడ్డును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి.కేటీఆర్, విద్య శాఖమంత్రి.పి.సబితా ఇంద్ర రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు.అరేకపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి మున్సిపల్ శాఖమంత్రివర్యులు కేటీఆర్ దిశనిర్దేశంలో పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుందని, జి.హెచ్.ఎం.సి అభివృద్ధి కోసం, ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా నూతన లింక్ రోడ్ల పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు జనాబ్ హమీద్ పటేల్ సహబ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి.రోజా రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాస్, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, అధికారులు జి.హెచ్.ఎం.సి కమిషనర్. లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, సి.ఈ జియాఉద్దీన్, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు, వార్డ్/ ఏరియా కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.