చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday September 27, 2022
కార్పొరేటర్ గీత ప్రవీణ్
మేడిపల్లి, సెప్టెంబర్26 (ప్రజాపాలన ప్రతినిధి)
చిల్కానగర్ డివిజన్ వార్డు కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికిి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ మాట్లాడుతూ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, మహిళా చైతన్య స్పూర్తి. తెలంగాణ తెగువను పోరాట పటిమను విశ్వానికి చాటి చెప్పిన వీర వనిత, ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదుల కొండల రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, కంచర్ల సోమిరెడ్డి, మాస శేఖర్, అల్లిబిల్లి మహేందర్, బాణాల నారాయణరెడ్డి,
రవీందర్ గౌడ్, రామానుజన్, ఫోటో బాలు, శీను నాయక్, శ్యామ్, సాయి, మహిళా అధ్యక్షురాలు సుభద్ర, సరిత , ఆండాలు , అంజలి ,సత్యవతి ఉమా ,శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.