మినరల్ వాటర్ వద్దు మిషన్ భగీరథ వాటర్ ముద్దు మిషన్ భగీరథ ఏ ఈ ఎర్ర శ్రీనివాసరావు

Published: Thursday July 07, 2022

బోనకల్, జులై 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చిరునోముల , చిన్న బీరవల్లి, రాయన్నపేట గ్రామాల పాఠశాలల్లో మిషన్ భగీరథ త్రాగు నీటి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏయ్ ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే అనర్ధాలు మరియు మిషన్ భగీరథ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం పరంగా కలిగే లాభాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో చిరునో ముల గ్రామానికి సంబంధించిన పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏ ఈ ఎర్ర శ్రీనివాసరావు, మైక్రో బయాలజిస్ట్ వేల్పుల నగేష్ , ఆ గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.