కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ కు అభినందనలుకళాకారుల వన సమ

Published: Monday November 28, 2022

మధిర రూరల్ నవంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆత్కూరు అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారులకు మధిర మండలం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపకులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కళా రంగంలో రాణిస్తున్న కళాకారులను మధిర ప్రాంత ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారని ఆయన అన్నారు. మధిర ప్రాంతంలో అనేక మంది కళాకారులు ఉన్నారన్నారు. కనుమరుగైతున్న కళలను మధిర కళాకారులు నిరంతరం ప్రోత్సహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అనేక సంవత్సరాలుగా మాటూరు పేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో కళాకారులకు వనభోజనాల నిర్వహించడం అభినందనీయం అన్నారు. కుల భోజనాలు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో కులాలకు, మతాలకు అతీతంగా కళాకారులకు వనభోజనాలు ఏర్పాటు చేసిన శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపకులు గడ్డం సుబ్బారావును ఆయన అభినందించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి హాజరైన పలువురు కళాకారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, బాబ్ల, డాక్టర్ కోటా రాంబాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు రంగిశెట్టి కోటేశ్వరావు కళా కారులు టీవీ రెడ్డి బాబ్ల పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కురిచేటి సత్యనారాయణ  హరినాధ్ రోశయ్య చౌదరి రామచంద్రరావు గోవర్ధన్ గాలిబ్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు కముమూరి వెంకటేశ్వరావు వైవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.