మంచాల మండలంలో ఘనంగా సీత్ల పండుగ ఉత్సవాలు

Published: Wednesday August 11, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు10 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండల పరిధిలోని ఆంబోతు తండ, సత్యం తండ, కొర్ర వాని తండా లలో మంగళవారం నుండి మొదలుకొని వారం రోజుల పాటు ప్రతి ఏటా గిరిజనులు సంప్రదాయంగా నిర్వహించే సిత్ల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచాల మండల జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ బద్దంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న సిత్ల పండుగను  ప్రభుత్వ లాంఛనాలతో జరిపించి రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు ఎడ్మా నరేందర్ రెడ్డి, స్థానిక ఎంపిటిసి రమావత్ రాందాస్ నాయక్, సర్పంచ్ రఘు నాయక్, పెంట్య  నాయక్, లక్ష్మి శంకర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు,మరియు హరి లాల్, బాను, శ్రీనివాస్, పర్శ్యా, నరేష్, బిచ్య, లక్కు, సీతారాం, బాలు నాయక్, చంటి నాయక్, రమేష్ రాథోడ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని, శీత్ల పండుగ ను విజయవంతం చేయడం జరిగింది.