సుఖ, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. .. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.సి. సుబ్బారాయుడ

Published: Friday March 10, 2023
లక్సెట్టిపేట , మార్చి 09, ప్రజాపాలన:
 
సుఖం, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.సి. సుబ్బారాయుడు అన్నారు. గురువారం లక్సెట్టిపేట సబ్ జైలు లో ఖైదీలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంటువ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైదీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా హెచ్ ఐ వి, టి బి లాంటి అంటు వ్యాధులు, హెపటైటిస్ బి,  సి  సంబంధించిన వ్యాధుల రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.సి సుబ్బారాయుడు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఫయాజ్ ఖాన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్,  సబ్ జైలు అధికారి స్వామి,  జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సూపర్ వైజర్ వి. అనిల్ కుమార్, ఐసిటిసి కౌన్సిలర్ అంజనేయులు, లాబ్ టెక్నిషయన్లు శ్రీనివాస రెడ్డి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.