కరోనా కష్టం కాలంలో బోనకల్ గ్రామస్తులకు అండగా నిలిచిన మాజీ జెడ్పిటిసి భానోత్

Published: Wednesday July 07, 2021
బోనకల్, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆరంభంలో గ్రామంలో పాజిటివ్ కేసులు 100 మందికిపైగా దాటడంతో వైరస్ సోకిన బాధితుల్లో అత్యధిక శాతం మంది పనికి పోలేక, ఇంట్లో పూట గడవక, బయటకు వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో సొంత గ్రామానికి సేవ చేయాలనే సదుద్దేశంతో మే 23 వ తారీకు కరోనా వైరస్ సోకిన బాధితులందరికీ మూడు పూటలా ఉచిత భోజన సౌకర్యాన్ని అందించడం మొదలెట్టిన మాజీ జెడ్పిటిసి బానోతు కొండఒక్క రోజు ఒక్క పూట కూడా మిస్ కాకుండా ప్రతిరోజు సరైన సమయానికి తన టీం సభ్యుల చేత కొండ - అండ కార్యక్రమం ద్వారా కరోనా వైరస్ సోకిన బాధితులకు ఉదయం అల్పాహార విందు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తో పాటు ఇమ్యూనిటీపవర్ పెంచేందుకు కోడిగుడ్డును మరియు ప్రతి ఆదివారం మరల మధ్యమధ్యలో మాంసాహార విందును కరోనా బాధితుల ఇంటివద్దకే అందించారు ముందుగా ఒక నెల రోజుల పాటు మాత్రమే భోజన సదుపాయాన్ని అందిస్తా మనీ అనుకున్న నెల రోజులు దాటినా కూడా బోనకల్లు గ్రామంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది అయినా బోనకల్ గ్రామంలో వైరస్ తగ్గేవరకు 44 రోజుల వరకు ఉచిత భోజన సౌకర్యాన్ని అందించారుఎవరూ ఊహించని విధంగా 44 రోజులపాటు కరోనా బాధితులకు సొంత గ్రామానికి అండగా నిలిచిన మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ ను కరోనా వైరస్ సోకిన బాధితులతో పాటు, బోనకల్ గ్రామస్తులు, మండల ప్రముఖులు, అధికారులు, జిల్లా స్థాయి నేతలు మరెంతో మంది బానోత్ కొండ చేస్తున్న సేవలను మెచ్చుకొని మద్దతు పలుకుతూ కొండ - అండ కార్యక్రమానికి అండగా నిలుస్తూ.. బానోతు కొండాకు అభినందనలు తెలిపారుకొండ చేస్తున్న సేవలను గమనించిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బానోతు కొండ మాట్లాడుతూ పుట్టిన గడ్డకు అండగా నిలవాలనే సదుద్దేశంతో కరోనా కష్టకాలంలో వైరస్ సోకిన బాధితుల క్లిష్ట పరిస్థితులను గమనించి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మానవ సేవే మాధవ సేవగా భావించి 44 రోజులపాటు కరోనా బాధితులకు అండగా నిలిచి సొంత గ్రామానికి సేవ చేశానని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొండ అండ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారుబోనకల్ గ్రామంలో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో తగ్గింది కనుక కొండ అండ కార్యక్రమం ముగిసినట్లు ఆయన తెలిపారు కొండ అండ కార్యక్రమానికి సహకరించిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని భానోత్ కొండ తెలిపారు