టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ నామ జన్మదిన వేడుకలు

Published: Wednesday March 16, 2022
మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరావు పుట్టినరోజు వేడుకలు ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరై టిఆర్ఎస్ నాయకులు తో  కేక్ కట్ చేసి, అన్నదానం సహా పలు సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్న మధిర మండల టౌన్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు. టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను మధిరలో మండల టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మరియు టిఆర్ఎస్సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.. అందులో భాగంగా ముందుగా వసంతమ్మ సేవా సదనంలో టీ.ఆర్.ఎస్ పార్టీ మధిర టౌన్ మండల ప్రజాప్రతినిధులతో కలసి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అలానే సేవా సదనంలో మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు అనంతరం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, మధిర మండల ఎంపీపీ మొండెం లలిత వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు మల్లాది వాసు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, PACS చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు డి మాధవి, గద్దల మాధురి, యన్నంసెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, కర్నాటి దుర్గా శ్రీనివాసరావు, మొండెం వెంకన్న, బోయపాటి వెంకటేశ్వరరావు, కొఠారి రాఘవరావు, యూత్ మండల అధ్యక్షులు అబ్బూరి రామన్, ముత్తరపు ప్యారీ, పిడికిటి సాంబ, జె.వి రెడ్డి, బాహాటం శ్రీనివాస్ రాజు, వాల్మీకి పవన్, ఆళ్ల నాగబాబు, జిల్లేపల్లి బాబురావు, జగన్నాధ చారి , రామకృష్ణ, బుర్రి బాబు, తోక వెంకయ్య సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.