సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభినందనలు

Published: Thursday March 10, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో సీఎం కేసిఆర్ ప్రకటన చేయడం పట్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, కేసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్  మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారి ఆధ్వర్యంలో నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది అని, టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355 సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500 విద్యుత్ సంస్థ‌ల ద్వారా 6,648 డీసీసీబీలు 1571 టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది అని మల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అని ఉద్యోగ నియామకాలుకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్ల‌తో పాటు నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ మ‌రో తీపి క‌బురు అందించారు. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు, ఓసీలకు 44 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి పట్ల యావత్ తెలంగాణ మొత్తం నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారని అదేవిధంగా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సీఎం కెసిఆర్ గారికి, అదేవిధంగా ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తమ ఎం కె ఆర్ పౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ఇస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఎం కె ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ)కి నియోజకవర్గం  నిరుద్యోగులు, యువత, కూడా జీవితాంతం రుణపడి ఉంటాను అని ఈ సందర్భంగా గుర్తు చేసారు.