కళ్యాణలక్ష్మీ పథకం పేదలకు వరంలాంటిది మంత్రి మల్లారెడ్డి

Published: Wednesday November 30, 2022
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన  కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి మల్లారెడ్డి 23 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పెద్ద కంచె సమస్య గురించి అంబేద్కర్ సంఘం నేతలతో మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వే నెంబర్ 63/2 నుండి సర్వే నెంబర్ 63/25 వరకు గల 336 ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్ పెండింగ్ ఉన్నదని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సుమన్ నాయక్, బొమ్మక్ సుగుణ బాలయ్య, హేమలత జంగారెడ్డి, గుర్రాల రమ వెంకటేష్ యాదవ్, తెరాస అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, తెరాస  సీనియర్ నాయకులు, అంబేద్కర్ సంఘం నేతలు పాల్గొన్నారు.