గమ్మత్తు' లో యువత

Published: Wednesday February 17, 2021
ఫిబ్రవరి16, ప్రజాపాలన- క్యాతనపల్లి : నిరంతరం పోటీ, అభివృద్ధి జీవితంలో విద్య, ఉపాధి వైపు వెళ్లాల్సిన పలువురు యువకులు గ' మ్మత్తు' లో ఆ వైపు యువత వెళ్లడం పట్టణంలో, జిల్లాలో చర్చానీయాంశంగా మరింది. పలు మార్లు మద్యం, గంజాయి, జూదం లాంటి కథనాలు ఓ వైపు వెలువడడంతో మరింత దూసుకుపోయిన రక్షక భటులు నిరంతరం అసాంఘిక చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. అయిప్పటికి పలువురు యువకులు మద్యం మత్తులో.. బంగారు భవిష్యత్తును రోడ్డు, బుగ్గిపాలు చేయడం జరుగుతున్నట్లు ప్రమాదాలు జరిగినప్పుడు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో నిర్మానుష్య స్థలాలలో మద్యం బాబుల హవా రహదారుల మీదుగా వాహనాలు నడుపుతూ చూపరుల గుండెల్లో భయాందోలనను సృష్టిస్తున్నారు. ప్రతి క్షణం ప్రధాన కూడళ్లతో పాటు పలు ఏరియాలలో పోలీసులు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు. అయినప్పటికి ఆకతాయిలు అతి వేగంతో పాటు మద్యం, ఇతర వ్యసనాల ద్వారా పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేయడం ఒకింత దిగ్రాంతికి గురిచేస్తుందని చెప్పవచ్చు. రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై కటికె రవిప్రసాద్ ను వివరణ కోరగా పట్టణంలో నిరంతరం ప్రజల రక్షణ కోసం గస్తీ కాయడంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తమ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం తాగి వాహనాలు నడిపినట్లైతే లైసెన్స్ రద్దుతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత పోటీ పరీక్షల్లో రాణించి తల్లిదండ్రులతో పాటు భావి తరాలకు దిక్సూకిగా ఉండాలని సూచించారు. పట్టంలో పెట్రోలింగ్ తో పాటు సిసి కెమెరాల ద్వారా ప్రధాన కూడళ్లను, ఇతర స్థలాలను సైతం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత మద్యం, గంజాయి, జూదం, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు