హజిపుర ప్రజల అవస్థలు 2 వ వార్డ్ లోని రోడ్లన్నీ బురధమయం

Published: Monday July 25, 2022

కోరుట్ల, జూలై 24 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని 2వ వార్డ్ హజీపురాలో గత కొన్ని రోజుల నుండి  కురుస్తున్న వర్షాలకు రోడ్డులు చాలా చెడిపోయయి గుంతలు గుంతలుగా మారాయి. ముఖ్యంగా ఈ రోడ్డుపై నుండి మూడు కలోనిల ప్రజలు వెళ్తుంటారు. ఈ కాలనీ ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బదికి గురైతున్నారని,
పిల్లలు బడికి వెళ్లాలంటే ఇదే దారి గుండ వెళ్ళాలని కాలనీ వాసులు వాపోయారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా  కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరమ్మతులు చేయించాలని  ఎం.డి.ముజ్జు కాంగ్రెస్ పార్టీ 2వ వార్డ్ ఇంచార్జ్ ,ఎం.డి ఫసి, షైక్ అహ్మద్, ఖలీల్, షైక్ హమీద్, ఐయూబ్, మతీన్, అబ్దుల్ మొయిజ్,
ఆఫ్రోజ్,అబ్దుల్లా, ప్యారే జని, వార్డ్ ప్రజలు తెలిపారు.