బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

Published: Tuesday February 09, 2021
బాలాపూర్ : ప్రజాపాలన;
బడంగ్పేట్  కార్పొరేషన్ లో,బడంగ్పేట్ కమాన్ నుండి  జనప్రియ విల్లా వరకు బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ  అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేషన్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రజలు  జనాభా పెరుగుతూ ఉండడంవల్ల వారికి అనుగుణంగా అవసరాలకు  కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసుకోవడంలో  మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన  విధానం అందరికీ అవసరం అన్నారు. కార్పొరేషన్ సమక్షంలో మెయిన్ రోడ్డు 150 ఫీట్ల వెడల్పు చెయ్యాలని తీర్మానంలో తీర్మానించారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ శాతం ఆస్తి నష్టం అవుతుందని అందరిని దృష్టిలో పెట్టుకొని వంద ఫీట్ల వరకు రోడ్డు వెడ్డింగ్ చేయాలని తీర్మానించారు.ఈ రోడ్డు వెడ్డింగ్  ప్రతి ఒక్కరూ సహకరించగలరని చెప్పారు. ఏప్పుడు రద్దీగా ఉన్న బడంగ్ పేట్ మెయిన్  రోడ్డు మన కార్పొరేషన్ మనమందరం కలిసి మనమే డెవలప్ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. ఎల్ ఆర్ ఎస్ ఫండ్ తీసుకోవడం జరుగుతుంది ని అన్నారు.    ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి,డి ఇ అశోక్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, డివిజన్ లో ఉన్న కార్పొరేషన్ (32) కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు యువకులు, కాలనీవాసులు, మహిళా మణులు, కాలనీ అసోసియేషన్ వాళ్లు, తదితరులు పాల్గొన్నారు.