జన్నారం లో కంటి వెలుగు

Published: Friday January 20, 2023

జన్నారం, జనవరి 19, ప్రజాపాలన:  తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు సంబంధించిన అందత్వం నుండి నివారణకు కొరకు నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమము గురువారం పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఆర్డీవో వేణు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ప్రజలకు పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కంటి ఆపరేషన్ అనంతరం కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో వందల మంది నిరుపేద ప్రజలు పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుండి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అమలు పరచడంలో స్థానిక గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులను అధికారులను అభినందించారు. అదేవిధంగా జన్నారం, ఇంధన్ పల్లి గ్రామపంచాయతీలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాదాడి సరోజన, ఎంపీడీవో అరుణరాణి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డ్ మెంబెర్లు కడర్ల నర్సయ్య, గంగన్న, సుదర్శన్, కో ఆప్షన్ లు సభ్యులు మల్లయ్య, రాగుల శంకర్, ఆశా వర్కర్ లు కుంబాల కవిత, తదితరులు పాల్గొన్నారు.