జవహర్ నగర్ లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023

జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి) : అంటరానితనం వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ దాదా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి  బాలాజీ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం కి  పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మహోన్నత శిఖరం బహుభాషా కోవిదుడు విద్యాసంపన్నుడు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందని. మహనీయులను జయంతి, వర్ధంతి కార్యక్రమాలలో స్మరించుకోవడం తో పాటు వారి ఆశయాలను కూడా మనందరం ముందుకు తీసుకు వెళ్ళడం చాలా అవసరమని,ఆ మహనీయుల బాటలో నడిచి దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మానవతావాది మహోన్నత విద్యవేత్త మేధావి తాత్వికుడు గొప్ప దేశభక్తుడు, ప్రపంచ రాజ్యాంగ చరిత్రలు అన్నిటిని అవలోకించి భారతదేశమునకు అత్యుత్తమ రాజ్యాంగ చరిత్రను అందించిన మహనీయుడు, స్వాతంత్ర భారత దేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత గొప్ప సంఘసంస్కర్తగా, దేశంలో అనగారిన షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ హక్కుల పోరాటంలో ముందుండి వారి హక్కులకు భద్రత కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమాలలో మునిసిపల్ కమిషనర్ రామలింగం, మున్సిపల్ సిబ్బంది, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, డివిజన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.