సీజనల్ నాయకుడు మధుయాష్కీ... ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతిక హక్కు లేదు : ఎమ్మెల్యే సంజయ్ కుమ

Published: Thursday March 31, 2022

జగిత్యాల, మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎండాకాలం వానాకాలం వర్షాకాలానికి ఒకసారి వచ్చే వ్యక్తి అని ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతికహక్కు మధుయాష్కి గౌడ్ కు లేదని ఎమ్మెల్యే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాలని త్రాగు సాగు నీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 5 వేల కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసిపడేల సాగునీటిని అందించారని నియోజకవర్గంలో సైతం నాలుగు కోట్లతో అనేక గ్రామాల్లో చెక్ డ్యాంలు నిర్మించారని తెలిపారు. ప్రపంచమే అబ్బురపరిచే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రం ఒక్క గోదాం కట్టలేదన్నారు. సంవత్సర కాలంలో సీజన్ వారిగా కనపడే నాయకుడు మధుయాష్కీ అని ఆయన ఏం అభివృద్ధి చేసాడో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డ్ కోసం ఎక్కని మెట్టు లేదని కలవని ముఖ్యమంత్రులు లేరని ఈ విషయాన్ని మధుయాష్కీ తెలుసుకోవాలన్నారు. నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మీరు ఎంపీగా ఉన్నపుడు ఏం చేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవితను విమర్శించే నైతిక హక్కు లేదని విరుచుకుపడ్డారు. వీలైతే రైతుల కోసం మీ మిత్రుడు రాహుల్ గాంధీతో మాట్లాడి రైతుల పక్షాన నిలబడాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పార్టి అధ్యక్షులు బాల ముకుందాం సారంగాపూర్ గుర్రాల రాజేందర్ రెడ్డి బీరుపూర్ నారపాక రమేష్ రాయికల్ కోలా శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ ఇంతియాజ్ అబ్దుల్ ఖాదర్ ముజహిధ్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.