అక్రమ అరెస్టులను ఖండిస్తున్న టియస్ యుటియఫ్ మండల కమిటీ

Published: Wednesday September 14, 2022

బోనకల్, సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: బదిలీలు, పదోన్నతుల సాధన కోసం నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు, టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల అధ్యక్షులు భూపతి ప్రీతమ్, ఉపాధ్యక్షులు కంభం రమేష్ కార్యదర్శులు ఏ పుల్లారావు, పి నరసింహారావు, పి గోపాలరావు, శ్రీనివాసరావు,కె సౌభాగ్య లక్ష్మి , చిన్న రంగారావు నారాయణ తదితరులు ఉన్నారు.