గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ

Published: Thursday July 01, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలో బుధవారం గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలిపారు.టేకుల సోమారం, లింగరాజుపల్లి, దాసిరెడ్డిగూడెం గ్రామాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్సీ నిధులతో నిర్మాణం చేసిన కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించారు. అనంతరం వలిగొండ నుండి కంచనపల్లి వరకు ఏడు కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణం కొరకు రూ 1. కోటి 15లక్షల నిధులతో ఏర్పాటు చేసిన నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామ వ్యవస్థలను పటిష్టం చేయడానికి నూతన భవనాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు చేగూరి బిక్షపతి, బోళ్ల లలిత శ్రీనివాస్, కొమురెల్లి సరితా సంజీవరెడ్డి, బొడ్డుపల్లి ఉమా సోలిపురం సాగర్ రెడ్డి, రేపాక అరుంధతి, ఎంపీటీసీలు చేగూరి భారతమ్మ గోపాల్, మోటే నరసింహ, నోముల మల్లేష్ యాదవ్, పలుసం రమేష్, మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపూరి కవిత రాములు, నాయకులు డేగల పాండు యాదవ్, రేపాక ప్రదీప్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, గుర్రం లక్ష్మారెడ్డి, గూడూరు శేఖర్ రెడ్డి, కొమురెల్లి ప్రదీప్ రెడ్డి, బొడిగె నరసింహ, చేగురి మల్లేశం, తహసిల్దార్ కె నాగలక్ష్మి, ఎంపీడీవో ఎల్ గీతారెడ్డి, పిఆర్ ఏఈ సుగుణాకర్, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.