ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ విద్యా సంస్థలే ముద్దు

Published: Thursday June 24, 2021

టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోల్కర్ సాయిరాం
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 23 (ప్రజాపాలన) : ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థలు మంచివని, లాక్ డౌన్ ఎత్తివేత అనేది ఒక బూటకమని, టిఎన్ఎస్ఎఫ్ ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పోల్కర్ సాయిరాం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిరాం మాట్లాడుతూ జూలై 1 నుండి విద్యాసంస్థలు రీఓపెనింగ్ అనే వార్త పెద్ద నాటకమని, జూలై 10 వరకు పాఠశాలలను ప్రారంభించి ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేసి మళ్లీ థర్డ్ వేవ్ కరోనా విజృంభిస్తుంది అని  విద్యాసంస్థలు మూసివేసే అవకాశాలున్నాయన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి అప్పుడే పేజీలు కట్టనవసరం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలలో చేర్చే ముందు ఆలోచించాలన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం ఉత్తమమని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ప్రైవేటు యాజమాన్యం తల్లిదండ్రుల నుండి ఫీజుల కొరకు ఒత్తిడి చేయొద్దని జీవో నెంబర్ 45, 46, ను పక్కాగా అమలు జరిగేలా విద్యాశాఖ తగు చర్యలు తీసుకోవాలన్నారు ఒకవేళ ఫీజుల కొరకు ఒత్తిడి చేసే విద్యాసంస్థలపై టీఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందన్నారు.