జిల్లా స్థాయి పోటీల్లో కాశి పేట కళాశాల విద్యార్థుల ప్రతిభ

Published: Wednesday December 15, 2021
బెల్లంపల్లి, డిసెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల మంచిర్యాలలో జరిగిన జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలలో కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు పాల్గొని పలు పథకాల్ని సాధించారని కళాశాల ప్రిన్సిపల్ వి.సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ గత ఆదివారం రోజున  మంచిర్యాల జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్ పోటీలు మంచిర్యాల పట్టణంలోని శ్రీసాధన గ్రీన్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు నిర్వహించారని ఇందులో 16, 18, 20, సంవత్సరాలలోపు విభాగాలలో విద్యార్థులు ఆర్, తిరుపతి, 18 సంవత్సరాల లోపు 6 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని మొదటి స్థానం పొంది గోల్డ్ మెడల్, సాధించాడని, ఆర్, వికాస్, ఇదే స్థాయిలో 6 కిలో మీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడని, 20 సంవత్సరాల విభాగంలో తగరం శ్రావణ్ కుమార్, పాల్గొని 8 కిలోమీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించాడని, ఇదే  విభాగంలో  కామెర పున్నం, 8 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడని, ఇదే విభాగంలో అంబాలా రఘువర్మ, 8 కిలో మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 6వ స్థానం సాధించారని వీరంతా ఈనెల 29న కరీంనగర్ లో జరగబోయే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో పాల్గొననున్నారని, వీరంతా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని కళాశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని సంతోష్ కుమార్ అన్నారు. అనంతరం  సంతోష్ కుమార్ క్రీడాకారులను మెడల్స్ మరియు సర్టిఫికెట్ తో సత్కరించి అభినందించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ టి, స్రవంతి, వ్యాయామ ఉపాధ్యాయులు సల్పల సంతోష్ యాదవ్, సుద్దాల ప్రవీణ్ మరియు పాఠశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.