పీర్జాదిగూడలో సంక్రాంతి మెగా ముగ్గుల పోటీలు

Published: Monday January 09, 2023
మేడిపల్లి, జనవరి 8 (ప్రజాపాలన ప్రతినిధి)
 పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్బంగా ఏవీఇన్ఫోప్రైడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మెగా ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.  
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షనలో  నిర్వహించిన మెగా ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో ఆడపడుచులు పాల్గొని ఉత్సాహంగా ముగ్గులను వేశారు.ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని విహారిక, శ్రీ సాయి నగర్, సాయి హిల్స్, క్రాంతి కాలనీలలో నుండి మహిళ సోదరిమణులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.
 ఈ ముగ్గుల కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.