**భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తే, ఊరుకోం ** -కార్మికులు అందరు బిఓసి సభ్యత్వాని తీసుకోవాలి.

Published: Monday January 23, 2023

-ఏఐటీయూసి రాష్ట్ర కౌన్సిల్  సభ్యుడు రామస్వామి, సత్యనారాయణ.

చేవెళ్ల జనవరి 21,(ప్రజాపాలన):-

చేవెళ్ల  మండల కేంద్రంలోని లేబర్ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై  ఏఐటీయూసి  ఆధ్వర్యంలో సమావేశం  ఏర్పాటు చేసారు.
ఈ ముఖ్యఅతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి వడ్ల సత్యనారాయణ హాజరై, కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, అసంఘటిత రంగంలో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారని అడ్డాల దగ్గర కనీస వసతులు లేకుండా మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నారని, కార్మికులందరూ లేబర్ కార్డు తీసుకోవాలని  తెలియజేశారు. ఈ  సందర్భంగా 50 మంది కార్మికులు నూతనంగా బిఓసి సభ్యత్వాన్ని తీసుకున్నారని అన్నారు.

*అధికారులు స్పందించి
రాంచందర్ మేస్త్రి పనిచేసిన 5 లక్షల రూపాయలు ఇప్పించాలి*


శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ సర్పంచి ఏనుగు నరసింహారెడ్డి,  రామ్ చందర్ అనే మేస్త్రి తోటి 16 లక్షల స్క్వేర్ ఫీట్ల సిసి రోడ్డును 16 లక్షల కు పొద్దుటూరు గ్రామంలో వేయించుకొని 11 లక్షల రూపాయలు చెల్లించగా,  ఇంకా రావలసిన ఐదు లక్షల రూపాయలు అడిగితే దౌర్జన్యంతో దుర్భాషలాడుతూ ఇవ్వకుండా సుమారు సంవత్సర కాలం పాటు రోజు తిప్పుకుంటూ అడిగితే బెదిరిస్తూ డబ్బులు ఇవ్వడం లేదు  అన్నారు.ప్రభుత్వ అధికారుల నుండి 16 లక్షలు ఎంబీ రికార్డు చేయించుకొని బిల్లు డబ్బులు  తీసుక్కున్న డని పనిచేసిన మేస్త్రీకి మాత్రం ఐదు లక్షల రూపాయలుఇవ్వలేదన్నారు.   అధికారులు వెంటనే స్పందించి రామ్ చందర్ మేస్త్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయని పక్షంలో ఏఐటీయూసీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏనుగు నరసింహారెడ్డి ఇంటిని మొట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగా మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రామచందర్ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి మల్గారి సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎండి మక్బుల్ ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి డి మల్లేష్ కార్మికులు తిరుపతమ్మ మా అన్నయ్య శ్రీను శివ తదితరులు పాల్గొన్నారు