శంకరపట్నం ఫిబ్రవరి 21 ప్రజాపాలన రిపోర్టర్: శంకరపట్నం మండలం తాడికల్ శివారులో సోమవారం లారీని ఆ

Published: Tuesday February 21, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం తాడికల్ శివారులో సోమవారం లారీని ఆటో ఢీకొనగా ఆటో అదుపు తప్పి బోల్తాపడి కరీంనగర్ మారుతి నగర్ కి చెందిన ఆటో డ్రైవర్ బాకం చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న 108 సిబ్బంది  కాజా ఖలీలుల్లా, ఇఎన్టి శ్రీధర్ లు ప్రధమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన  నిలిపి ఉంచిన లారీ, తిరిగి వెల్లే క్రమంలో లారీ డ్రైవర్ వేగంగా కుడి పక్కకు తిప్పడంతో కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఆటో లారీని ఢీకొని బోల్తా పడినట్లు ఆటో డ్రైవర్ చిరంజీవి  తేలిపాడు