మధిర సేవా సమితిసేవ యే మా మార్గం సేవా మార్గం

Published: Monday June 28, 2021

మధిర, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర కరోనా కష్టకాలంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు మధిర సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు పల్లపోతు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని సరోజ మరియు కుమారులు హానీష్ సాయి రోహిత్, మనోజ్ రాహుల్ గార్ల ఆర్థిక సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్లపోతు ప్రసాదరావు, మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, చారుగుండ్ల నరసింహమూర్తి, యర్రా లక్ష్మణ్, షేక్ జహంగీర్, లాయర్ వాసుదేవరావు, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ, పల్లపోతు బాల సుబ్రహ్మణ్యం, స్వాతి తదితరులు పాల్గొన్నారూ