రోళ్లవాగు ఆధునీకరణ పనుల్లో వేగం పెంచండి - కలెక్టర్ జి.రవి

Published: Saturday February 06, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 05 (ప్రజాపాలన): బీరుపూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున బీర్పూర్ మండలంలో జరుగుతున్న రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులను  కలెక్టర్ పరిశీలించారు. ఈ సదర్బంగా  మాట్లాడుతూ జనవరి 22వ తేదిన రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులపై నిర్వహించిన సమాశంలో జారి చేసిన ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. పనుల వేగవంతానికి అవసరమైన మీషనరీలను మరియు కూలీల సంఖ్యను  పెంచాలని నిర్ణిత గడువులో పూర్తి చేయాలని కోరారు. 6200 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకాన్ని 7500 క్యూబిక్ మీటర్లకు పెంచాలని ఇసిక సమస్యలు తలెత్తకుండ చూడాలని అధికారులకు సూచించారు. పనులలో ఏమైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. రాజేషం డిఈ చక్రునాయక్ తహసీల్దార్ నాగార్జున సంబంధిత అధికారులు పాల్గోన్నారు.