భట్టి కులాల మధ్య చిచ్చుపెట్టే పద్ధతులను మానుకోవాలి తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడ

Published: Friday February 10, 2023
బోనకల్, ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి:
 సిఎల్పీ నేత, మల్లు భట్టి విక్రమార్క కులాల మధ్య చూపెడుతున్నారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు రావుల హనుమంతరావు,జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మ కంటి సైదులు విమర్శించారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1964 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 98 జీవో తీసుకువచ్చి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఇతర కులాలు ఉండటానికి వీలులేదని కేవలం చేపల వృత్తి చేసే కులాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసిందన్నారు. ఆ విధంగానే నేటి వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో చేపల వృత్తి చేసే కులాలు మాత్రమే మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులుగా ఉంటూ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కానీ సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీ సమావేశంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో చేపల వృత్తి చేయని ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను కూడా చేర్చాలని డిమాండ్ చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అనేక కులాలు వారి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అదేవిధంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కూడా మత్స్య పారిశ్రామిక వృత్తిపై జీవనం సాగిస్తున్నారన్నారు. కులవృత్తి ఆధారంగా జీవిస్తున్న తమ వృత్తిలోకి ఇతర కులాలను చేర్చాలని బట్టి విక్రమార్క శాసనసభలో డిమాండ్ చేయటాన్ని కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందన్నారు. బట్టి విక్రమార్క ఇటువంటి దిగజారు ప్రకటనలు చేసి కులాల మధ్య చిచ్చుపెట్టే పద్ధతులను మానుకోవాలని హితవు పలికారు. వెంటనే శాసనసభలో బట్టి విక్రమార్క తన ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల బట్టి విక్రమార్కను మధిర నియోజకవర్గం తో పాటు జిల్లాలో ఎక్కడ కూడా ముదిరాజు వాడలలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. అవసరమైతే ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శాసనసభ ముందే భట్టి విక్రమార్కన శాసనసభ నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా గౌరవ సలహాదారు ప్రతానపు రామనాథం, జిల్లా కార్యదర్శి ప్రతానపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు పగడాల హనుమంతురావు, జిల్లా కోశాధికారి గాదె రాంబాబు, ఖమ్మం 16వ డివిజన్ అధ్యక్షుడు నర్ల శేషయ్య, బోనకల్ మండల అధ్యక్షుడు గనపారపు వెంకటేశ్వర్లు, మండలంలోని వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులు జ్వాలా స్వామి, దూబ శ్రీను, దొప్ప కొరివి వీరభద్రం కొండబోయిన వెంకట నరసయ్య, పరిస పుల్లయ్య, గోగుల నాగరాజు వివిధ గ్రామాలకు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.