అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు

Published: Friday December 30, 2022
పరిగి కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి జగన్ 
వికారాబాద్ బ్యూరో 29 డిసెంబర్ ప్రజా పాలన : అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని పరిగి కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి జగన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పరిగి యువజన కాంగ్రెస్ నాయకులను  ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల నియామకాల అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రంలో తప్పుగా వచ్చిన 11 ప్రశ్నలకు మార్కులు కలుపుతూ లాంగ్ జంపు ఈవెంట్స్ పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి జగన్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు  శ్రీనివాస్ నాయక్ దోమ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పరిగి మండల అధ్యక్షులు నాగవర్ధన్  టిఆర్ఆర్ యువసేన అధ్యక్షుడు శ్రీశైలం పరిగి నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ మహేష్ టౌన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ మరియు రాజ్ కుమార్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.