గ్యాస్,డీజిల్ స్మశాన వాటికలు త్వరలో ప్రారంభం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday April 29, 2021

పటాన్ చేరు, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : సుమారు 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో  పటాన్చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు, ఆయన బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో  స్మశానవాటిక నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు, ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీనీ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని, ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు, ఇప్పటికే స్మశాన వాటికకి సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయ్యాయని, కరోనా వ్యాధితో మరణించిన మృతదేహాలకు సుమారు 7500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు ఆరువేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు, ఇది పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు, ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.