భారీ వర్షాలకు కాలనీలు అతలాకుతలమైన కానరాని కార్పొరేటర్

Published: Monday July 19, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : అమీర్ పేట్ అంటేనే హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రదేశం, ఎల్లప్పుడూ జనాలతో వ్యాపారాలకు కేంద్రంగా ఉన్న అమీర్ పేట్ లో నిన్న మొన్నటి భారీ వర్షాలకు కొన్ని కాలనీలు అతలాకుతలం అయ్యాయి. అటువంటి కాలనీలలో బురదతో నిండిన రోడ్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పి వారి సమస్యలు పరిష్కరించడానికి పర్యటించాల్సిన కార్పొరేటర్ కానరాకపోవడం గమనార్హం. రెండు రోజుల ముందు ఎల్లమ్మ తల్లి కళ్యాణం లో అన్నింటిలో ముందున్న కార్పొరేటర్ వర్షాలు పడి కాలనీలలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కనీసం పర్యటించాల్సిన భాద్యత కార్పొరేటర్ కు లేకపోవడం దయనీయం అంటున్నారు ప్రజానీకం. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శేషుకుమారిని ప్రజలు గుర్తుకుచేసుకోవడం గమనార్హం, ఆమె గత వరదల సమయంలో తక్షణమే స్పందించి వరదలకు గురైన ప్రతీ కాలనీని సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని, ప్రస్తుత కార్పొరేటర్ శుభకార్యాలప్పుడు మాత్రమే కనిపిస్తుంది కానీ సమస్యలు విన్నవించుకుందామంటే కనీసం ఒక ఆఫీసు కూడా లేదన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ఏవైనా ప్రబలే అవకాశం అధికంగా ఉండడం, మరోవైపు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటే ప్రజలకు అండగా ఉండాల్సిన కార్పొరేటర్ శుభకార్యాలకు హాజరై సమస్యలు ఉన్నప్పుడు మాత్రం దూరంగా ఉండడం దారుణం అంటున్నారు ప్రజలు..