ధరలు పెరిగినాయని ధర్నాలు ఎందుకు -కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Wednesday March 08, 2023
రాయికల్,మార్చి 07 ;(ప్రజాపాలన ప్రతినిధి): ప్రజలపై అప్పుల భారం మోపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.మంగళవారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచకుండా,రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల రూ. ల అప్పులు చేసి ప్రజలపై అప్పుల భారం మోపడంతో ఒక్కొక్కరిపై లక్ష రూ:ల అప్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వాపోయారు.వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినయని రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేపట్టే బదులు రాష్ట్రం విధించే పన్నును మినహాయిస్తే ప్రజలపై ధరల భారం తగ్గుతుందని సూచించారు. కేంద్రాన్ని నిందించడానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ధరల భారాన్ని తగ్గించే ప్రణాళిక చేపట్టడం లేదన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి రుణమాఫీ లు చేపట్టకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.  
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకే  తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే హాత్ సే హాత్ జొడో పాదయాత్రను మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు,యువత స్వచ్ఛందంగా పాల్గొని జోడోయాత్రను విజయవంతం చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు.అనంతరం
రాయికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మమతకు, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లామహిళా ఉపాధ్యక్షురాలుగా మాజీ జడ్పిటిసి గోపి మాధవి ఎంపికైనట్లు తెలుపుతూ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సాలువాతో సన్మానించి, నియమాకా పత్రాలను అందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, పట్టణ మండల అధ్యక్షులు రవీందర్ రావు, రమేష్ , కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కొయ్యేడి మహిపాల్ రెడ్డి, దివాకర్ రెడ్డి ,మున్ను,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.