రోడ్డు దాటుతుండగా కారు డీకొని వృద్దుడికి తీవ్ర గాయాలు శంకరపట్నం ప్రజాపాలన రిపోర్టర్ డిసెం

Published: Tuesday December 20, 2022

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన పెద్దవేణి ఐలుమల్లు (60) సోమవారమునాడు గొల్లపల్లి గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద రోడ్డు దాటుతుండగా హుజురాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది  ఈఎంటి సురేష్, పైలెట్ గోపీకృష్ణ లు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.