పేద ప్రజలకు వరంలాంటిది కల్యాణలక్ష్మి పథకం

Published: Wednesday May 26, 2021
మంత్రి మల్లారెడ్డి  మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి, మే25 (ప్రజాపాలన ప్రతినిధి) : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు వరంలాంటిదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మిి, షాదీ ముబారక్ చెక్కులను 39 మంది లబ్దిదారులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి మరియు మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతుల మీదుగా లభిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. కరోనా విపత్తులో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా ప్రజల బాధలు గుర్తించిన సీఎం కేసీఆర్  ప్రజా సంక్షేమాన్ని విడనాడటం లేదని అన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రజలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసీల్దార్ ఎస్తేరు అనిత, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, మున్సిపల్ మేనేజర్ జ్యోతి, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బొడిగే స్వాతి, కోల్తూరు మహేష్, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, ఎన్. మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, పప్పుల అంజి రెడ్డి, బి.ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, బొడిగే కృష్ణ గౌడ్, లేతాకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.