నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమశ్రీ

Published: Friday March 10, 2023
 బోనకల్, మార్చి 09 ప్రజా పాలన ప్రతినిధి : ఆర్థికంగా వెనకబడిన ప్రతిభ గల విద్యార్థిని, విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేస్తుంది. దీనిలో భాగంగా డిసెంబర్ 18, 2022న నిర్వహించిన ప్రతిభా పాటవ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని గుడిద ఉమశ్రీ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికిరణ్ గురువారం తెలిపారు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పథకానికి ఎంపికైన ఉమశ్రీ కి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 ల స్కాలర్షిప్ వస్తుందన్నారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన తరగతి పూర్తి అయ్యేవరకు మొత్తం రూ. 48,000 ల వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుందన్నారు. ప్రతిభా పాటవ పరీక్షలో నెగ్గి స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థిని ఉమశ్రీని సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, ప్రధానోపాధ్యాయులు రవికిరణ్, రామకృష్ణ, ఎస్ఎంసి చైర్మన్ మడుపల్లి రమేష్, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.