కిశోర బాలిక లకు పౌష్టికాహారం, అంగన్వాడీ టీచర్లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా

Published: Saturday August 20, 2022
అశ్వారావుపేట ప్రజా  పాలన  (ప్రతినిధి) , అశ్వారావుపేట ఐసిడిఎస్  ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. సిడిపిఓ రోజా రాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది కిశోర బాలికలకు ఒక్కొక్కరికీ సుమారు మూడు వేల రూపాయలు ఖరీదు చేసే పౌష్టికాహారం నెయ్యి, ప్రోటీన్ పౌడర్, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు సిడిపిఓ రోజా రాణి సిడిపిఓ ఆఫీస్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, పూర్తిస్థాయిలో ప్రహరీ గోడ నిర్మాణం చేయించాలని, మరుగుదొడ్లు సౌకర్యం మెరుగుపరచాలని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సమస్యల పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణింద్ర, తహసిల్దార్ చల్లా ప్రసాద్, బండి పుల్లారావు, రాజమోహన్ రెడ్డి, అఫ్జల్ బేగం, అట్టం రమ్య,  సుమతి తదితరులను ఐసిడిఎస్ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, తహసీల్దార్ చల్లా ప్రసాద్, సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, రాజమోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయుల సూర్యప్రకాష్ రావు, అశ్వారావుపేట పెరాయిగూడెం సర్పంచులు అట్టం రమ్య, సుమతి, అగ్రికల్చర్ ఏడి అఫ్జల్ బేగం, ఎంపీ ఓ సీతారామరాజు, టిఆర్ఎస్ అశ్వారావుపేట పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, పెరాయిగూడెం గ్రామ అధ్యక్షులు చిప్పనపల్లి బజారయ్య తదితరులు పాల్గొన్నారు.