పోల్కంపల్లి యువకుడు నర్సింహ్మకు డాక్టరేట్

Published: Monday October 11, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం లోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన పంది. నర్సింహ్మ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదిగి భారతదేశ చిత్రపటంలోని ఎక్కడో మారుమూల గ్రామస్థాయి నుంచి విద్యను ఓ ఆయుధంగా ఎంచుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ యూనివర్సిటీలో పి హెచ్ డి ప్రధానం చేశారు. ఆయనకు డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ సెండ్ దేర్ అప్లికేషన్ ఇన్ సూపర్ క్యాప్చర్స్ అనే అంశంపై పరిశోధన నిర్వహించడంతో పరిశోధనల్లో పాల్గొన్నట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. ఉన్నత చదువులు చదివారని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు భరించి గౌరవ డాక్టరేట్ రావడం మాకు మాకుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పి.నర్సింహ్మ మాట్లాడుతూ కష్టపడి, ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చని అన్నారు. అంబెడ్కర్ ఆలోచన విధానాన్ని ఆచరిస్తున్న నాకు సహకరించిన మా కుటుంబం సబ్యులకు, నా గైడ్ ప్రొఫెసర్ హరిసోనా వాన్, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ కొల గార్లకు ధన్యవాదాలు తెలిపారు.