కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కోటి వృక్షార్చన కార్యక్రమం

Published: Thursday February 18, 2021
జగిత్యాల జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల తిప్పనపెట్ గ్రామంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తిప్పన్నపేట్ గ్రామ సర్పంచ్ రౌతు జయ, ఉపసర్పంచ్ బొడ్డు బుచన్న, జగిత్యాల అర్బన్ వైస్ ఎంపిపి ములసపు లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర రావు, రూరల్ ఎంపిపి గంగారాం గౌడ్, ఎక్స్ వైస్ ఎంపిపి గంగం మహేష్  మరియు వివిధ హోదాలో ఉన్న తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.