నాగులచెరువులో పనులను ప్రారంభించిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు..

Published: Friday April 22, 2022
తల్లాడ, ఏప్రిల్ 21 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నాగులచెరువు వద్ద సుమారు 20 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సుమారు వందమంది కూలీలతో చెరువును పూడిక తీసే పనులు చేపడుతున్నామన్నారు. ఈ మట్టిని రైతులకు తమ పొలాలకు ఉపయోగించడం జరుగుతోందన్నారు. దీంతో చెరువులో నీరు నిల్వ ఉండటమే కాకుండా భూమికి సారవంతమై మట్టి రైతులకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఏజాజ్, వైరా మార్కెట్  కమిటీ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఎస్ఎంసి చైర్మన్ శెట్టిపల్లి చంద్రయ్య, నాయకులు శెట్టిపల్లి లక్ష్మణరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.