దేశ,రాష్ట్ర అభివృద్ది కోసం ఎల్డిఎఫ్ బలోపేతం చేయాలి

Published: Thursday June 16, 2022
తమ్మినేని వీరభద్రం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
 
మంచిర్యాల టౌన్, జూన్ 15, ప్రజాపాలన : దేశ,రాష్ట్ర అభివృద్ది కోసం ఎల్డిఎఫ్ బలోపేతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మంచిర్యాల , కొమురం భీం జిల్లాల ఫ్లీనరీ సమావేశం  బెల్లంపల్లి ఏరియాలోని టి సి ఓ ఏ క్లబ్ లో నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తమ్మినేని వీరభద్రం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హాజరై  ఆయన  మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన,  నిరక్షరాస్యత మెరుగైన వైద్యం అందలంటే బిజెపి, కాంగ్రెసు రాష్ట్రంలోని టిఆర్ఎస్ విధానాలు పనికి రావని వీటికి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు పోవాలంటే  ఎల్ డి ఎఫ్ తో మాత్రమే సాధ్యమవుతుంది. రాబోయే రోజులలో ఎల్ డి ఎఫ్ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఐక్య పోరాటాల ద్వారా ముందుకు సాగాలని తెలియజేశారు. దేశంలో కొన్ని లక్షలమంది ఉద్యోగాలు ఊడిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నమాట అటక మీదకు ఎక్కించి, ఉన్న కాస్త ఉద్యోగాలను కూడా ఊడగొట్టి రోడ్లమీద  నిరుద్యోగులుగా నిలబెడుతున్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం  ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన గిరిజన, దళిత భూములను వివిధ పేర్లతో నిర్బంధ కాండతో లాకుంటుంది.  రాబోయే రోజుల్లో సమస్యలపై ప్రజలను కార్మికులను ప్రజల ను ఒక తాటి పైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమాలతోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవి కుమార్, పైల్ల ఆశన్న, బి. మధు,సంకే రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కూశన రాజన్న కొమురం భీం జిల్లా కార్యదర్శి,  జిల్లా నాయకులు రమణ, గుమాస అశోక్, ముంజం శ్రీనివాస్,అల్లూరి లోకేష్, కనికరం అశోక్, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్,కాసర్ల రాజలింగు, పున్నం, రాజ్ కుమార్,దేవదాసు,
ప్రకాష్,రాజారాం,ఆనంద్,
దినకర్ తదితరులు పాల్గొన్నారు